Share News

Lok Sabha Elections: డిగ్గీ రాజా గట్టెక్కేనా?

ABN , Publish Date - May 05 , 2024 | 07:48 AM

సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ (Congress) మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ (Digvijay Singh) మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకప్పటి కంచుకోట అయిన ఈ స్థానంలో 77 ఏళ్ల దిగ్విజయ్‌.. బీజేపీ సిటింగ్‌ ఎంపీ రోడ్మల్‌నగర్‌తో తలపడుతున్నారు...

Lok Sabha Elections: డిగ్గీ రాజా గట్టెక్కేనా?

న్యూ ఢిల్లీ, ఆంధ్రజ్యోతి: సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ (Congress) మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ (Digvijay Singh) మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకప్పటి కంచుకోట అయిన ఈ స్థానంలో 77 ఏళ్ల దిగ్విజయ్‌.. బీజేపీ సిటింగ్‌ ఎంపీ రోడ్మల్‌నగర్‌తో తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రోడ్మల్‌ ఇక్కడి నుంచి గెలుపొందారు. రాజ్‌గఢ్‌ లోక్‌సభ పరిధిలో 8 అసెంబ్లీ సీట్లుంటే.. 6 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. 2003లో అధికారం కోల్పోయిన అనంతరం 16ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు దిగ్విజయ్‌. 2019లో భోపాల్‌ నుంచి పోటీ చేసి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.


ఇప్పుడు రాజ్‌గఢ్‌ నుంచి బరిలో దిగారు. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘అభ్యర్థిని కాదు.. మోదీని చూసి ఓటేయమని కోరుతున్నారు. ఆయన వచ్చి మీ సమస్యలు తీరుస్తా రా? నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ మార్పు చూపిస్తా’’అని కోరుతున్నారు. 2018లో ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసిన కుట్రను వివరిస్తూ, ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగ్విజయ్‌ వెంట యువకులతో కూడిన వృత్తి నిపుణుల బృందం ఉంటోంది. వీరు కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ రాజ్‌గఢ్‌లోని యువతతో అనుసంధానమ వుతున్నారు. దిగ్విజయ్‌కు మద్దతుగా ఆయన భార్య, మాజీ జర్నలిస్టు అమృతా సింగ్‌ ప్రచారం చేస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 07:51 AM