Share News

Palnadu: గొడవల తర్వాత పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌

ABN , Publish Date - May 18 , 2024 | 03:22 PM

ఏపీలో ఇటివల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు(Palnadu) జిల్లాకు కొత్త కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ జిల్లాకు కొత్త కలెక్టర్‌ వచ్చారు. ఈ నేపథ్యంలో లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Palnadu: గొడవల తర్వాత పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌
Lathkar Srikesh Balaji

ఏపీలో ఇటివల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు(Palnadu) జిల్లాకు కొత్త కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ జిల్లాకు కొత్త కలెక్టర్‌ వచ్చారు. ఈ నేపథ్యంలో లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇప్పటివరకు కలెక్టర్‌గా ఉన్న తొలేటి శివశంకర్‌ను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పల్నాడులో జరిగిన హింసాత్మక సంఘటనలు నేపథ్యంలో శివశంకర్‌ను ట్రాన్స్ ఫర్ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం పల్నాడులో జరిగిన హింసపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్‌, డీజీపీలకు కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఈ క్రమంలోనే కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ ప్రవర్తనా నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ ఘటనల నేపథ్యంలో ఇటివల పల్నాడు జిల్లా కలెక్టర్ సహా పలువురిపై చర్యలు తీసుకుంది.


ఇది కూడా చదవండి:

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 18 , 2024 | 03:32 PM