Share News

Viral Video: వామ్మో..! ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా.. బుసలు కొడుతున్న కోబ్రాను సైతం.. చిన్న ట్రిక్‌తో..

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:01 PM

పాములు కనపడితే చాలు కొందరు ఆమడదూరం పరుగెడుతే.. మరికొందరు వాటితో పరాచకాలు ఆడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో శిక్షణ తీసుకున్న కొందరు భయంకరమైన పాములను సైతం ఎంతో ...

Viral Video: వామ్మో..! ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా..  బుసలు కొడుతున్న కోబ్రాను సైతం.. చిన్న ట్రిక్‌తో..

పాములు కనపడితే చాలు కొందరు ఆమడదూరం పరుగెడుతే.. మరికొందరు వాటితో పరాచకాలు ఆడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో శిక్షణ తీసుకున్న కొందరు భయంకరమైన పాములను సైతం ఎంతో సులభంగా పట్టుకుంటుంటారు. పట్టుకోవడమే కాకుండా వాటికి ముద్దు కూడా పెడుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. బుసలు కొడుతున్న కోబ్రాను ఆమె కంట్రోల్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


2018లో పోస్టు చేసిన ఈ వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేదికపై ఓ బృందం పాములను ఆడిస్తూ అందరికీ అవగాహన కలిస్తుంటుంది. ఈ క్రమంలో వారు కోబ్రాతో (Cobra) వినూత్నం ప్రయోగం చేస్తారు. వారిలో యువతి పాము ముందు కూర్చుంటుంది. అప్పటికే ఆవేశంతో ఉన్న కోబ్రా.. యువతిపై బుసలుకొడుతుంది. అయినా ఆమె ఏమాత్రం భయపకుండా.. ఓ నల్లటి గుడ్డ ముక్కను పాముకు చూపిస్తూ తికమకపెడతుంది.

Delhi Metro Video: రెండు కాళ్లు సీటుపై పెట్టిన యువకుడు.. పక్కనే మరో వ్యక్తి కూర్చోవడంతో.. చివరకు..

ఇలా గుడ్డ ముక్కతో రెండు మూడు సార్లు పాముకు చూపించాక.. నేరుగా కోబ్రా తలపై (young woman kissed the cobra) ముద్దు కూడా పెడుతుంది. అొంతటితో ఆగకుండా పాము తల కింద చేత్తే మెల్లగా నిమురుతుంది. అప్పటి వరకూ ఆవేశంగా ఉన్న కోబ్రా.. యువతి చేత్తో ముట్టుకున్నా ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ యవతి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘కోబ్రాను భలే కంట్రోల్ చేసిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేంటీ..! రాజమౌళి సినిమాలాగా ఉందే.. రెండస్థుల మేడలాగే కనిపిస్తున్నా...

Updated Date - Apr 20 , 2024 | 02:32 PM