Share News

Viral News: క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు

ABN , Publish Date - May 01 , 2024 | 04:05 PM

కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు అంటుంటారు. ఏ రంగంలో అయినా సరే.. మనసు పెట్టి పని చేస్తే, తప్పకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెప్తుంటారు. అఫ్‌కోర్స్.. మధ్యమధ్యలో నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగితేనే..

Viral News: క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు

కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు అంటుంటారు. ఏ రంగంలో అయినా సరే.. మనసు పెట్టి పని చేస్తే, తప్పకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెప్తుంటారు. అఫ్‌కోర్స్.. మధ్యమధ్యలో నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగితేనే.. ఊహకందని ఫలితం దక్కుతుంది. ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. తనకు ఏదో ఒక రోజు జాక్‌పాట్ తగులుతుందన్న నమ్మకంతో.. అతను కొంతకాలం నుంచి లాటరీలు కొనుగోలు చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతను కోరినట్టుగానే.. ఏకంగా రూ.10 వేల కోట్ల లాటరీ తగిలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు అందుకే చోటు కల్పించలేదేమో

చెంగ్ సైఫాన్ (Cheng Saephan) అనే 46 ఏళ్ల వ్యక్తి.. కొన్నాళ్ల క్రితం తన కుటుంబంతో లావోస్ నుంచి అమెరికాకు (America) వలస వచ్చాడు. అక్కడే స్థిరపడిన అతనికి కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ (Cancer) సోకినట్లు తేలింది. ఇందుకు అతను ఎనిమిదేళ్ల నుంచి కీమోథెరపీ (Chemotherapy) చేయించుకుంటున్నాడు. కట్ చేస్తే.. లాటరీల ద్వారా ఎందరో జీవితాలు మలుపు తిరుగుతుండటంతో, తానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెంగ్ సెఫాన్ లాటరీలు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. తనకు చాలాసార్లు నిరాశ ఎదురైనా.. ఏదో ఒక రోజు అదృష్టం తలుపు తడుతుందన్న ఉద్దేశంతో, లాటరీలను కొనడం వదిలిపెట్టలేదు. ఈ క్రమంలోనే.. అతడు పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో భాగంగా లాటరీలు కొన్నాడు.

మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ

ఇటీవల ఈ డ్రా నిర్వహించగా.. ఒక టికెట్‌ మొత్తం ఐదు నంబర్లు (22, 27, 44, 52, 69)తో సరిపోలిందని.. దీని విలువ 1.3 బిలియన్‌ డాలర్లు (రూ. 10 వేల 842 కోట్లలకు పైగా) అని నిర్వాహకులు వెల్లడించారు. టాక్స్‌లో భాగంగా 422 మిలియన్ డాలర్లు తగ్గించి, అతనికి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మరోవైపు.. ఈ లాటరీ తనకు తగలడంతో చెంగ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టికెట్లు కొనేందుకు సాయం చేసిన తన భార్య, స్నేహితుడితో ఈ డబ్బు పంచుకుంటానని తెలిపారు. అలాగే.. క్యాన్సర్ నుంచి విముక్తి పొందేందుకు మెరుగైన చికిత్స చేయించుకుంటానని చెప్పాడు. కాగా.. పవర్‌బాల్‌ చరిత్రలో ఇది నాల్గవ అతి పెద్ద లాటరీ.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 01 , 2024 | 04:05 PM