Share News

Shocking Video: అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో గ్రామస్తులందరూ కలిసి ఏం చేశారంటే..

ABN , Publish Date - May 01 , 2024 | 12:46 PM

బీహార్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకు ఆ వ్యక్తి మామ, గ్రామస్థులు సాక్షులుగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన సికిందర్ యాదవ్ (45) అనే వ్యక్తి ఇద్దరు పిల్లల తండ్రి.

Shocking Video: అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో గ్రామస్తులందరూ కలిసి ఏం చేశారంటే..
Man Marries mother-in-law

బీహార్‌ (Bihar)లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకు ఆ వ్యక్తి మామ, గ్రామస్థులు సాక్షులుగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన సికిందర్ యాదవ్ (45) అనే వ్యక్తి ఇద్దరు పిల్లల తండ్రి. కొన్ని రోజుల క్రితం అతడి భార్య చనిపోయింది. దీంతో అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారింటికి మకాం మార్చాడు. మామ ఢిలేశ్వర్ దర్వే, అత్త గీతా దేవితో కలిసి ఉంటున్నాడు (Man Marries mother-in-law).


ఆ క్రమంలో తన అత్త (Mother-in-law) గీతా దేవి (55)కి సికిందర్ యాదవ్ దగ్గరయ్యాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా గడిపేవారు. ఆ ఇద్దరి విషయమై ఢిలేశ్వర్‌కు అనుమానం మొదలైంది. దీంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. గ్రామస్తులకు కూడా విషయం తెలిసింది. వీళ్ల ప్రేమకథ ఊరంతా వార్తగా మారడంతో గ్రామస్థులంతా కలసి అల్లుడికి, అత్తగారికి పెళ్లి చేశారు.


గ్రామస్థులందరి ముందూ అత్తగారిపై తనకున్న ప్రేమను సికిందర్ బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ఢిలేశ్వర్ వారి పెళ్లికి అంగీకారం తెలిపాడు. దీంతో మామ, గ్రామస్థులందరి ముందే తన అత్తగారైన గీతా దేవిని సికిందర్ వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో ఉన్న ఐదు పైన్ ఆపిల్స్‌ను కనిపెట్టండి!


Viral: వామ్మో.. టీచర్ మీద ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఎగ్జామ్ పేపర్‌లో స్టూడెంట్ రాసింది చూసి షాకైన టీచర్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 12:46 PM