Share News

Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో ఉన్న ఐదు పైన్ ఆపిల్స్‌ను కనిపెట్టండి!

ABN , Publish Date - May 01 , 2024 | 10:13 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో ఉన్న ఐదు పైన్ ఆపిల్స్‌ను కనిపెట్టండి!
Opitcal Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఇంటి లివింగ్ రూమ్ ఉంది. ఆ ఫొటోలో కుర్చీలు, టేబుళ్లతో పాటు చాలా వస్తువులు ఉన్నాయి. ఆ ఫొటోలో వివిధ ప్లేస్‌ల్లో పైన్ ఆపిల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోలో ఆ పైన్ ఆపిల్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 15 సెకెన్ల వ్యవధిలో ఆ పైన్ ఆపిల్స్ ఎక్కడున్నాయో కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పైన్ ఆపిల్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ టీచర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. పిల్లల సంతోషాన్ని క్యాప్చర్ చేసేందుకు ఆమె ఏం చేసిందో చూడండి..


Viral Video: అలా కనిపిస్తున్నారు కానీ, వీళ్లు మామూలు దొంగలు కారు.. వీరి మోసం ఏ రేంజ్‌లో ఉంటుందంటే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 10:13 AM