Share News

Happy hormones: రోజంతా హ్యాపీగా ఉండాలనుందా? హ్యాపీ హార్మోన్స్ ను పెంచే ఈ ఫుడ్స్ ను తింటే..!

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:36 PM

సంతోషంగా , పాజిటివ్ గా ఉంటే రోజులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా చాలా ఈజీగా దాటేయచ్చు. అయితే చాలామందికి ఎలాంటి సమస్యలు లేకపోయినా రోజంతా నీరసంగా, డల్ గా ఉంటారు. శరీరంలో తగినంత హ్యాపీ హార్మోన్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

Happy hormones: రోజంతా హ్యాపీగా ఉండాలనుందా? హ్యాపీ హార్మోన్స్ ను పెంచే ఈ ఫుడ్స్ ను తింటే..!

సంతోషం సగం బలం అని అన్నారు పెద్దలు. సంతోషంగా , పాజిటివ్ గా ఉంటే రోజులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా చాలా ఈజీగా దాటేయచ్చు. అయితే చాలామందికి ఎలాంటి సమస్యలు లేకపోయినా రోజంతా నీరసంగా, డల్ గా ఉంటారు. శరీరంలో తగినంత హ్యాపీ హార్మోన్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సెరటోనిన్, డోపమైన్, ఎండార్పిన్ వంటి హార్మోన్లను హ్యాపీ హార్మోన్లు అని అంటారు. ఈ హార్మోన్లు న్యూరోట్రాన్స్మీటర్ ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. మెదడు మీద ఒత్తిడి తగ్గించి హ్యాపీగా ఉండేలా చేస్తాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ పెరగడానికి సహాయపడే ఆహారాలేంటో తెలుసుకుంటే..

సాల్మన్..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న సాల్మన్ చేప మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సెరోటోనిన్ ఉత్పత్తి పెంచుతుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించే హ్యాపీ హార్మోన్.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!


అరటిపండ్లు..

అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంజి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాకరిస్తుంది. అరటిపండ్లలో విటమిన్-బి6 కూడా ఉంటుంది. ఇది ట్రిప్టోఫాన్ ను సెరోటోనిన్ గా మార్చడంలో సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్..

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్ లు ఉంటాయి. ఇవి మెదడుకు రక్తస్రావాన్ని పెంచుతాయి. ఎండార్పిన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

బెర్రీలు..

బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు ఎదుర్కోవడానికి, డోపమైన్ పెరుగుదలకు సహాయపడతాయి.

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!


నట్స్..

నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి, న్యూరోట్రాన్మిటర్ పనితీరుకు తోడ్పడతాయి.

అవకాడో..

అవకాడోలో కొవ్వులు న్యూరోట్రాన్మిటర్ సిగ్నలింగ్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

చిక్కుళ్లు..

చిక్కుళ్లలో ఫోలేట్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ తో సహా న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణలో పాత్ర పోషిస్తుంది. మూడ్ రెగ్యులేషన్ కు తోడ్పడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 04:36 PM