Share News

AP Elections: గాజు గ్లాసుపై కోర్టుకు కూటమి: వర్ల రామయ్య

ABN , Publish Date - May 01 , 2024 | 05:38 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన అంశం అగ్గిరాజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు అంశంపై కూటమి నేతలు వివరించామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఈవోకు అర్థం కాలేదని తేల్చిచెప్పారు.

AP Elections: గాజు గ్లాసుపై కోర్టుకు కూటమి: వర్ల రామయ్య
Glass Symbol

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన అంశం అగ్గిరాజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు అంశంపై కూటమి నేతలు వివరించామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఈవోకు అర్థం కాలేదని తేల్చిచెప్పారు.


జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో మిగతా వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దు. ఇదే అంశాన్ని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 13 పార్లమెంట్ స్థానాల పరిధిలో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆయా చోట్ల అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులకు సీటు ఇవ్వొద్దు. సీఈవో మాత్రం గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. కోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారని ధ్వజమెత్తారు.


పార్లమెంట్ స్థానంలో ఆరు నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఒక్క పార్లమెంట్ స్థానంలో జనసేన అభ్యర్థి ఉంటే.. ఆ పార్లమెంట్ పరిధిలో గల అసెంబ్లీలో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దు. ఇదే అంశంపై తాము సీఈసీకి వివరించామని వర్ల రామయ్య అంటున్నారు. అయినప్పటికీ అర్థం చేసుకోవడం లేదని.. అందుకే కోర్టుకు వెళ్లడం తప్పడం లేదని స్పష్టం చేశారు.


Read Latest
AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 05:39 PM