Share News

AP ELECTIONS : అనంత విస్మరణ!

ABN , Publish Date - May 02 , 2024 | 12:29 AM

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్‌ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్‌ నుంచి పంగళ్‌ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో ...

AP ELECTIONS : అనంత విస్మరణ!
What a difference in greenery

హామీలు మరిచిన సీఎం, ఎమ్మెల్యే

అర్బనలో రహదారులు అస్తవ్యస్తం

సుందర అనంత.. చెత్తమయం

డంప్‌ యార్డు సమస్యకు పరిష్కారమేదీ..?

జిల్లా కేంద్రమైన అనంతపురం నగరానికి ప్రత్యేకత ఉంది. ఇలాంటి చోట గెలవడానికి వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి గత ఎన్నికల్లో అంతులేని హామీలు ఇచ్చారు. గెలిచి ఐదేళ్లవుతున్నా ప్రచార ఆర్భాటమే తప్ప చేసిందేమీ లేదు. రక్షణ గోడపై స్వయాన సీఎం హామీ ఇచ్చినా దిక్కులేకుండా పోయింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కలగానే మిగిలిపోయింది. నగర పాలక సంస్థలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. కమీషన్లు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిని గాలికి వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు.


అనంతపురం క్రైం, మే 1: వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్‌ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్‌ నుంచి పంగళ్‌ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో అధికారులు, కాంట్రాక్టర్లు రూ.కోట్లలో బిల్లులు చేసుకున్నారు. చెత్తను తొలగించి ఉంటే కాస్తలో కాస్త సుందరంగా ఉండేది. కానీ చెత్త దిబ్బలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. పాలకవర్గంలో కీలకమైన మేయర్‌, డిప్యూటీ మేయర్ల మధ్య అంతర్గత విభేదాలున్నాయనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. పాలకవర్గంలో కొందరు ఆదాయం కోసమే పనిచేస్తూ అభివృద్ధి పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అధికారులు, పాలకవర్గంలో కొందరి వ్యవహారంతో అవినీతి తారస్థాయికి చేరింది.


సీఎం హామీకే దిక్కులేదు

అనంతపురం నగరంలో 2022 అక్టోబరులో కురిసిన వర్షాలకు నగరంతో పాటు చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ సమయంలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. వరదల సందర్భంగా చేపట్టిన చర్యలు తూతూమంత్రమే. నగరంలోని ప్రధాన కాలువలైన మరువవంక, నడిమివంక రక్షణ గోడ, వంతెన నిర్మాణాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. శివారు ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగు పరిచి డ్రైనేజీ నిర్మాణాలు చేస్తామని చెప్పినా అమలు కాలేదు.

-నగరంలో పారిశుధ్యం ప్రధాన సమస్య. మురుగు తీయని కాలువలు, మురికి నీటితో పొంగుతున్న కాలువలు దర్శనమిస్తుంటాయి. పందులు, దోమల బెడద నిత్యం ఉండేదే. కార్పొరేషన అయినప్పటికీ మున్సిపల్‌ కార్మికుల సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో పారిశుధ్య సమస్య ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది.

- అనంతపురం నగరం గుత్తిరోడ్డులో ఉన్న డంపింగ్‌యార్డ్‌ తరలింపు సైతం హామీగానే మిగిలిపోయింది. ఆ యార్డ్‌ వలన స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022లో చెత్తను బయోమైనింగ్‌ విధానంలో కొంత తొలగించారు. మళ్లీ చెత్త గుట్టలుగా పేరుకుపోయింది.


- నగరం చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అసలు కార్యాచరణే రూపొందలేదు. ప్రతిపాదన సైతం ముందుకు సాగలేదు.

- పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మాణం చేపడతామని చెప్పినా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. వాటికి

- బిల్లులవుతాయనే నమ్మకాన్ని సైతం కల్పించలేదు. నగరంలోని ప్రజలకు శివారు ప్రాంతాల్లోని జగనన్న లేఅవుట్లలో ఇళ్లు కేటాయించారు. కొన్ని నిర్మాణాలు సాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అసలు ప్రారంభమే కాలేదు. ఇప్పటిదాకా కనీసం ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు.

- అనంతపురం నగర శివారులోని కాలనీలకు సైతం పీఏబీఆర్‌ ద్వారా తాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. రుద్రంపేట, అనంతపురం గ్రామీణ పంచాయతీల్లో ఇంకా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదు.

అమలు ఏదీ..?

అనంతపురం నగర జనాభా 3.50లక్షలకు చేరుకుంది. పారిశుధ్యం అత్యంత ప్రధాన సమస్యగా మారింది. ఎన్నికలకు ముందు అనంత వెంకటరామిరెడ్డి భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని ప్రధానంగా హామీ ఇచ్చారు. ఇందుకు రూ.200కోట్లతో ప్రతిపాదనలు చేసినా ఇప్పటిదాకా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఐదేళ్లు గడుస్తున్నా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఊసే లేకపోవడం గమనార్హం.


అవినీతి మరక

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి కమీషన విషయంలో అవినీతి మరక అంటుకుంది. రోడ్ల నిర్మాణాల పనుల్లో ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చా యి. నగరంలోని పంగల్‌రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు 9.2కిలో మీటర్ల మేర రూ.270కోట్ల వ్యయంతో చేపట్టిన ఫోర్‌లేన రోడ్డు నిర్మాణం విషయంలో రూ.కోట్లలో కమీషన పుచ్చుకున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇదే రోడ్డు విషయంలో మేయర్‌, డిప్యూటీ మేయర్లకు కొంత శాతం కమీషన దక్కాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కాంట్రాక్ట్‌ తమకు దక్కలేదని కొందరు కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు.

- డంపింగ్‌ యార్డులో బయోమైనింగ్‌ పేరుతో రూ.26కోట్లు ఖర్చు చేశారు. కానీ అక్కడ మతలబు జరిగి కొంత వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందనే ఆరోపణలు వినిపించాయి.

- కార్పొరేటర్లు ఆదాయం లేకపోవడంతో ఎక్కడ ఆదా యం ఉంటే అక్కడ వాలిపోయారు. ప్రధానంగా అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసుకుంటూ వచ్చారు. కాంట్రాక్టర్లు సైతం తమ డివిజన్లలో చేసే పనులకు 10శాతం కమీషన ఇవ్వాల్సిందేనంటూ ఆల్టిమేటం జారీ చేశారు.

- నగరంలో 50 డివిజన్లకు గాను 48మంది వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు. పాలకవర్గం అస్తవ్యస్త పాలనతో అభివృద్ధి కుంటుపడింది. నగరపాలికలో టౌనప్లానింగ్‌ లాంటి విభాగాలు అవినీతికి కేరాఫ్‌ అడ్ర్‌సలుగా నిలుస్తున్నాయి.

- పీఏబీఆర్‌ నుంచి రూ.కోట్లు వెచ్చించి అనంతపురం నగరానికి తాగునీటి శుద్ధి చేసి అందిస్తున్నారు. కానీ తరచూ లీకేజీల సమస్యతో నీరు సరఫరా కాక నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో నీటి రంగే మారిపోతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు ఫిల్టర్‌ వాటర్‌కే మొగ్గు చూపుతున్నారు.


- నగరంలో అక్కడక్కడా రోడ్లు వేసినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మట్టిరోడ్లు, గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. గత కొంతకాలంగా అభివృద్ధి చెందిన శ్రీనగర్‌ కాలనీలో చాలా వరకు మట్టిరోడ్డే ఉంది. మరి కొన్ని ప్రధాన రహదారులతో పాటు చిన్న కాలనీ రోడ్లలో సైతం గుంతల రోడ్లే ఉన్నాయి. ఏపీఎంఐపీ ద్వారా పైపులైన్లకు గత ప్రభుత్వంలో గుంతలు తవ్వారు. వాటినీ ఇప్పటికీ సరిగా పూడ్చలేని పరిస్థితి.

- నగరంలో రూ.35కోట్లకు పైగా పనులకు టెండర్‌ పిలిచి, సంబంధిత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ కుదర్చుకున్నారు. కానీ గత బిల్లులు రావడం లేదనే సాకు చూపి ఆ పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో జనరల్‌ ఫండ్‌, 15వ ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్‌ గ్రాంట్‌ కింద మంజూరైన అభివృద్ధి పనులకు బ్రేక్‌లు పడ్డాయి.

- నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నగరంలో ఏ ప్రధాన రోడ్డును కూడా మాస్టర్‌ ప్లాన ప్రకారం విస్తరించింది లేదు. పాతూరులోని తిలక్‌రోడ్డు, గాంధీబజార్‌ రోడ్డు, ఆర్‌ఎ్‌ఫరోడ్డు, రాజు రోడ్డు లాంటి ప్రధాన రహదారులు నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడుతుంటాయి. శ్రీకంఠం సర్కిల్‌ నిత్యం బిజీగానే ఉంటుంది. ఫోర్‌లేన రోడ్డు రూపంలోనైనా సుభా్‌షరోడ్డు విస్తరణకు నోచుకుంటుందని భావించినా అది ఊహాగానాలకే పరిమితమైంది. సప్తగిరి సర్కిల్‌ను విస్తరించే యోచనే కనిపించట్లేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:30 AM