Share News

Viral video: ఇతనేంటీ..! బంగారం లాంటి బైకును ఇలా చేశాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - May 05 , 2024 | 08:16 PM

కొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు కొత్త వాహనాల రూపురేఖలు మార్చి విచిత్రంగా తయారు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు...

Viral video: ఇతనేంటీ..! బంగారం లాంటి బైకును ఇలా చేశాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

కొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు కొత్త వాహనాల రూపురేఖలు మార్చి విచిత్రంగా తయారు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బుల్లెట్ బైకును చిత్రవిచిత్రంగా మార్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బుల్లెట్ బైకును (Bullet bike) విచిత్రంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎవరూ ప్రయత్నించని రీతిలో సరికొత్త ప్రయోగం చేశాడు. బుల్లెట్ బైకు రెండు టైర్లను తీసేసి, వాటి స్థానంలో మొత్తం (rickshaw tires ) నాలుగు రిక్షా టైర్లను అమర్చాడు. అలాగే బైకు పెట్రోల్ ట్యాంక్‌పై Loser’s Army అని రాశాడు. ఈ బుల్లెట్ వాహనం చూసేందుకు చిత్రవిచిత్రంగా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంటోంది.

Viral video: నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.., ‘‘బాగున్న బైక్ కాస్తా.. బిసేబుల్ బైక్‌గా మారింది’’.., ‘‘ఇప్పుడు హెల్మెట్‌తో పాటూ సీట్ బెల్ట్ కూడా ధరించాలి’’.., ‘‘బైకుకు రిక్షా టైర్లు.. సూపర్’’.., ‘‘ఈ బైకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది’’.. ‘‘ఇప్పుడు టోల్‌గేట్ కూడా చెల్లించాల్సి వస్తుంది’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..

Updated Date - May 05 , 2024 | 08:16 PM