Share News

Viral video: నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - May 05 , 2024 | 05:37 PM

పామును కనపడగానే చాలా మంది ఆమడ దూరం పారిపోతుంటారు. మరికొందరు వాటిని నాగదేవతలా ఆరాధిస్తుంటారు. ఇంకొందరు పండుగల వేళల్లో పుట్టలో పాలు పోసి మరీ పూజలు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

Viral video: నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

పామును కనపడగానే చాలా మంది ఆమడ దూరం పారిపోతుంటారు. మరికొందరు వాటిని నాగదేవతలా ఆరాధిస్తుంటారు. ఇంకొందరు పండుగల వేళల్లో పుట్టలో పాలు పోసి మరీ పూజలు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. నాగపూజ చేయమంటే.. వీళ్లు ఏకంగా జీవించేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబం తమ ఇంట్లో నాగపూజ (Nagapooja) చేయాలని అనుకుంది. సాధరాణంగా ఎవరైనా నాగుపాము ఫొటోలు లేదా విగ్రహాలు ఉంచి పూజలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే వీళ్లేమో.. ఏకంగా నిజమైన పాముతో (Nagapooja with real cobra) పూజ చేయాలని భావించారు. ఇందుకోసం ఓ నాగుపామును తీసుకొచ్చి పెద్ద ప్లేటులో ఉంచారు. దాని చుట్టుూ కుంటుంబ సభ్యులంతా కూర్చుని పూజలు స్టార్ట్ చేశారు. ఇదేమీ తెలీని పాము.. తనను ఏం చేస్తున్నారో అని భయపడి బుసలు కొడుతూ వారిని భయపెట్టింది. అయినా వారు మాత్రం పూజ ఆపలేదు.

Viral video: వామ్మో..! ఇదేం విచిత్రం.. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్.. కమోడ్‌ నుంచి ఏకంగా..


పూజారి సలహా మేరకు మధ్యలో పాముపై పాలు తదితరాలను కూడా పోస్తారు. ఈ క్రమంలో పాము వారిని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే వారు అప్రమత్తంగా ఉంటూనే పూజలు కొనసాగించారు. అయితే పాములు ఆడించే వ్యక్తి అక్కడే ఉండి.. వారికి సలహా ఇస్తూ ఉంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బాబోయ్.. ఇలాంటి పూజలు ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘పాములను ఇబ్బందిపెట్టొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: క్లాస్ రూమ్‌ టీవీలో రొమాంటిక్స్ సీన్స్ చూసి అవాక్కైన యువతులు.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..

Updated Date - May 05 , 2024 | 05:37 PM