Share News

Viral video: క్లాస్ రూమ్‌ టీవీలో రొమాంటిక్స్ సీన్స్ చూసి అవాక్కైన యువతులు.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - May 05 , 2024 | 04:16 PM

ప్రస్తుతం అన్ని రంగాలపైనా టెక్నాలజీ విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. చివరకు విద్యారంగంలో కూడా టెక్నాలజీ ప్రవేశించింది. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ టీవీల్లో వీడియోలు ప్లే చేస్తూ బోధించడం, ఆన్‌లైన్ తరగుతులు నిర్వహించడం సర్వసాధారణమైంది. ఇప్పుడీ...

Viral video: క్లాస్ రూమ్‌ టీవీలో రొమాంటిక్స్ సీన్స్ చూసి అవాక్కైన యువతులు.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం అన్ని రంగాలపైనా టెక్నాలజీ విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. చివరకు విద్యారంగంలో కూడా టెక్నాలజీ ప్రవేశించింది. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ టీవీల్లో వీడియోలు ప్లే చేస్తూ బోధించడం, ఆన్‌లైన్ తరగుతులు నిర్వహించడం సర్వసాధారణమైంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్ టీవీలో రొమాంటిక్స్ సీన్స్ ప్లే చేయడంతో యువతులు షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు (Coaching Centre) సంబంధించిన క్లాస్ రూమ్‌లో ఇంటర్ చదివే యువతీయువుతులకు ఓ వ్యక్తి టీవీలో వీడియోలు ప్లే చేస్తూ బోధిస్తుంటాడు. అయితే ఇంతలో టీవీలో ఓ సినిమాలో హీరో, హీరోయిన్లు ముద్దులు (kiss scene) పెట్టుకునే సీన్ ప్లే అవుతుంది. ఈ వీడియో రాగానే విద్యార్థినులు అంతా అవాక్కవుతారు. ఈ వీడియో వైరల్ అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసభ్యకర వీడియోలు ప్లే చేస్తూ ఎలాంటి విద్య బోధిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

Viral video: ఈ టీ దుకాణ యజమాని తెలివే తెలివి.. కోతిని భలే వాడేశాడుగా..


ఈ ఘటన ఫిజిక్స్ వాల్లా అనే కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన శ్రీనగర్ బ్రాంచ్‌కు చెందినగా కొందరు తెలిపారు. అయితే దీనిపై సదరు కోచింగ్ సెంటర్ యాజమాన్యం స్పందించింది. ఇందులో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడికి, తమ సెంటర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇది ఎవరో కావాలనే క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు కలుగుజేసుకుని, విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: వామ్మో..! ఇదేం విచిత్రం.. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్.. కమోడ్‌ నుంచి ఏకంగా..

Updated Date - May 05 , 2024 | 04:17 PM