Share News

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..

ABN , Publish Date - May 05 , 2024 | 07:01 PM

కొన్నిసార్లు తెలిసీ తెలీక చేసే పనులు చివరకు ప్రాణాల మీదకు వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బామ్మ...

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు తెలిసీ తెలీక చేసే పనులు చివరకు ప్రాణాల మీదకు వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బామ్మ తన నాలుగు నెలల మనువడికి పాలు పట్టే క్రమంలో పొరపాటు చేసింది. పాలు తాగే క్రమంలో చిన్నారి పదే పదే బాటిల్‌ను పక్కకు నెట్టేయడం చూసి ఆమెకు అనుమానం కలిగింది. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. ఇటలీలోని Italy) దక్షిణ ప్రావిన్స్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫ్రాంకావిల్లా ఫోంటానా అనే పట్టణంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వృద్ధురాలు తన నాలుగు నెలల మనువడిని ఆడిస్తోంది. ఆ సమయంలో చిన్నారి ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టడంతో పాలు పట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె వంట గది నుంచి పాల పౌడర్‌ను తీసుకుంది. ఆ పౌడర్‌ని నీళ్లలో కలపాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా చేసింది.

Viral video: వామ్మో..! ఇదేం విచిత్రం.. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్.. కమోడ్‌ నుంచి ఏకంగా..


వంటగదిలో నీళ్లు కలిపే సమయంలో నీళ్ల బాటిల్ అనుకుని.. మందు బాటిల్ తీసుకుంది. ఇలా చివరకు పాల పౌడర్‌లో (Milk powder) మద్యం కలిపి చిన్నారికి పట్టింది. అయితే కొన్ని పాలు తాగిన తర్వాత సదరు చిన్నారి.. ఆ బాటిల్‌‌ను పక్కకు నెట్టేశాడు. పదే పదే ఇలాగే చేస్తుండడంతో వృద్ధురాలికి అనుమానం వచ్చి బాటిల్‌ను పరిశీలించింది. వాసన చూడగానే అందులో మద్యం (alcohol) కలిసినట్లు గుర్తించింది. తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. వెంటనే బాబును చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించింది.

Viral video: క్లాస్ రూమ్‌ టీవీలో రొమాంటిక్స్ సీన్స్ చూసి అవాక్కైన యువతులు.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..


మద్యం శరీరంలోకి వెళ్లడంతో బాబు అస్వస్థతకు గురయ్యాడు. అయితే వైద్యులు వెంటనే చికిత్స అందించి, ట్యూబ్ సాయంతో కడుపు మొత్తం క్లీన్ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో.. బామ్మా.. ఎంత పొరపాటు జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘చిన్నారికి ఏమీ కాలేదు.. థ్యాంక్స్ గాడ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - May 05 , 2024 | 07:01 PM