రాయ్‌పూర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు.

రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లోనే  శతకం బాదాడు.

మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.

రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

అలానే దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడింది.