ఒకే టార్గెట్.. కొడితే కప్పే..  రోహిత్ ప్లానింగ్ అదిరిందిగా..

  ఐపీఎల్‌లో 6 ట్రోఫీలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు హిట్‌మ్యాన్.

 ఇన్ని కప్పులు కొట్టాడు కాబట్టి కొత్త టార్గెట్స్ లేవని అనుకోవద్దు. తనకో లక్ష్యం ఉందని అంటున్నాడు హిట్‌మ్యాన్.

  ముంబైని గెలిపించాలనే ఏకైక టార్గెట్ కోసమే ఆడుతున్నానని తెలిపాడు రోహిత్.

  ఎక్కువ రన్స్ చేసేయాలనే కోరిక తనకు లేదని స్పష్టం చేశాడు.

  600, 700 లేదా 800 రన్స్ కొట్టినా.. టీమ్ ఓడితే వాటికి విలువ ఉండదన్నాడు రోహిత్.

  రన్స్, రికార్డ్స్, మైల్‌స్టోన్స్ కంటే తన ఫోకస్ అంతా గెలుపు మీదే ఉంటుందన్నాడు.

 ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో 240 రన్స్ చేసిన హిట్‌మ్యాన్.. సెకండాఫ్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు.