పుజారా కెరీర్ నాశనం చేసిందెవరు..  ఆ బుక్‌లో ఏం ఉంది..

టెస్టుల్లో భారత్‌కు మూలస్తంభంగా ఉన్న పుజారా 2 ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

దేశవాళీల్లో రాణిస్తున్నా పుజారాను కాదని యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు ఇస్తోంది బీసీసీఐ.

ఈ తరుణంలో అతడి సతీమణి పూజా పబరి సంచలన వ్యాఖ్యలు చేసింది.

2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో ఒక్క టెస్ట్‌లో ఫెయిలైనందుకు పుజారాను తీసేయాలనుకున్నారట.

గాయంతో ఇబ్బంది పడుతూనే టీమ్ కోసం ఆడుతున్న తనను తీసేయాలనుకోవడం పుజారాను తీవ్రంగా బాధించిందట.

పూజా పబరి పట్టుబట్టి అడిగితే.. నువ్వు పొగిడే ఓ వ్యక్తి నన్ను తీసేయాలని చూశాడని రివీల్ చేశాడట పుజారా. దీన్ని ది డైరీ క్రికెటర్స్ వైఫ్ అనే తన బుక్‌లో రాసుకొచ్చిందామె.

పుజారా కెరీర్‌ను సొంత మనుషులే నాశనం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.