కోహ్లీ దోస్తుపై కేసు.. శిక్ష తప్పదా?

ఆర్సీబీ స్టార్ పేసర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 

యూపీలోని ఇందిరాపురం పోలీసు స్టేషన్‌లో దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద యష్ దయాల్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 

యష్ దయాల్ నేరం చేసినట్లు నిరూపితమైతే అతడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన యూపీ పోలీసులు.. దయాల్‌ను ఇంకా విచారించలేదు.

త్వరలో దయాల్‌ను అరెస్ట్ చేస్తారని.. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందుకు నిరాకరించాడని, శారీరకంగానూ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.