భారత మహిళా క్రికెట్‌ను గుర్తింపే లేని గమ్యం నుంచి శిఖరాగ్రానికి చేర్చిన నిశ్శబ్ద విప్లవం.. మిథాలీ రాజ్. నేడు ఆమె 43వ పుట్టిన రోజు.
భారత క్రికెట్ క్వీన్‌గా పేరొందిన మిథాలీ.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. సరిగ్గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల పుస్తకాన్ని నింపినట్టే!
16 ఏళ్ల 205 రోజుల వయసులో 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. సరిగ్గా సచిన్ కూడా ఇదే వయసులో అరంగేట్రం చేయడం విశేషం.
అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మిథాలీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
వన్డే కెరీర్‌లో 232 మ్యాచ్‌లు ఆడి 7805 పరుగులు సాధించింది. ఇందులో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలున్నాయి.
2002లో ఇంగ్లండ్‌తో టెస్టులో 214 పరుగులు సాధించి.. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన అతిపిన్న వయస్కురాలి(19 ఏళ్లు)గా చరిత్ర సృష్టించింది.
వన్డే క్రికెట్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది.
2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథూ.. 22 ఏళ్ల 274 రోజుల సుదీరఘ క్రికెట్ కెరీర్ రికార్డు కూడా తన పేరు మీదే లిఖించుకుంది.