శివుడి భక్తులు ఈ ఆకు ను చాలా  భక్తి తో శివలింగం పై పెడతారు

బిల్వ ఆకు మామూలు ఆకులా కనిపించినా.. శివుడి పూజ లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.

బిల్వ ఆకు సాధారణంగా మూడు ఆకులు కలిసి ఉంటుంది. ఇది హిందూ మతంలో బ్రహ్మ, విష్ణు, శివుల త్రిమూర్తిని సూచిస్తుంది.

బిల్వ ఆకు అంటే ప్రకృతిలోని సత్వ, రాజస, తమస అనే మూడు గుణాలను అలాగే శివుడి మూడు కళ్ళు.. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ఆకులోని ప్రతి భాగంలో కనిపిస్తాయి.

హిందూ పురాణాల ప్రకారం.. ఈ చెట్టు లక్ష్మీ దేవికి సంబంధించినదిగా భావిస్తారు.

స్కంద పురాణం వంటి గ్రంథాల్లో బిల్వ ఆకును భక్తితో తాకినా పుణ్యం వస్తుందని చెబుతారు. శివుడికి సమర్పించిన బిల్వ పత్రం.. భక్తుడి జీవితంలోని చెడు కర్మలను శుభ్రం చేసే శక్తిని కలిగి ఉందని నమ్మకం.

ఈ ఆకులోని మూడు భాగాలు మనలోని గర్వం, కోరికలు, కోపాన్ని సూచిస్తాయని అంటారు.

శివలింగంపై ఈ ఆకును పెట్టడం ద్వారా భక్తుడు తన లోపాలను వదిలేస్తూ.. దేవుడి దగ్గర తాను పూర్తిగా లీనమయ్యానని చెబుతున్నట్లు ఉంటుంది.

శివుడు చాలా తక్కువ వాటితోనే తృప్తి పడే దేవుడు. బంగారు అలంకారాలు, ఖరీదైన పువ్వులు ఆయనకు అవసరం లేదు. బిల్వ పత్రం గొప్ప ప్రదర్శన కాకుండా.. స్వచ్ఛమైన మనసుతో చేసే భక్తిని సూచిస్తుంది

అందుకే ఆయనకు ఈ ఆకు అంటే చాలా ఇష్టం. ఇది అందం కన్నా లోతైన ఆలోచనను.. ఆకర్షణ కంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది.