శ్రావణ మాసం వస్తే చాలు అస్సలే  మాంసాహారం తినకూడని చెబుతుంటారు.

హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి చాలా విషిష్టత ఉంటుంది.

ఈ మాసం శివునికి ప్రీతికరమైన మాసం అంటుంటారు.ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో శివున్ని ఆరాధిస్తూ.. నిత్యం పూజలు చేస్తుంటారు.

మహిళలు ఉపవాసాలు ఉండటమే కాకుండా వ్రతాలు చేసుకుంటారు. నిత్యం పూజ చేస్తూ ఆలయాలను సందర్శిస్తుంటారు.

శాస్త్రీయ పరంగా కూడా నాన్ వెజ్ తినక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయంట.

శ్రావణ మాసం అనేది వర్షాకాలం మధ్యలో వస్తుంటుంది.వర్షాకాంలలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే ఈ సీజన్‌లో నీటి నాణ్యత బాగుండదు.

శ్రావణ మాసంలో వాతావరణం చాలా తేమగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంటుందంట.

ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది కాదంట.  కడుపు సంబంధమైన సమస్యలు అధికం అవుతాయంట.