బోనాల పండుగ ఎలా మొదలైంది.. నేపథ్యం ఏంటో తెలుసా..
తెలంగాణలోని అత్యంత ప్రముఖమైన, ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి.
పల్లవుల పాలన కాలం నుండి ఈ పండుగకు మూలాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.
కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, కుతుబ్ షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకొన్నారు.
హైదరాబాద్‌లో బోనాల పండుగ 1869 తర్వాత నుండి విస్తృతంగా జరుపుకోవడం ప్రారంభమైంది.
ఈ కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ప్లేగు వ్యాధి విజృంభించింది. అనేక మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు.
ఈ సమయంలో, ఉజ్జయినిలోని మహంకాలి అమ్మవారిని ప్రార్థించి, ప్లేగు వ్యాధి తగ్గితే హైదరాబాద్‌లో ఆమెకు గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు
1908లో మూసీస నది వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
అప్పటి నిజాం, మీర్ మహబూబ్ అలీఖాన్..
లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి, ముసి నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను సమర్పించారు.
అప్పటి నుండి, లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాడ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతలను కూడా పూజిస్తారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, నమ్మకాలను ప్రతిబింబిస్తుంది.
Related Web Stories
శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినరో తెలుసా
కూకట్ పల్లిలో బోనాల సందడి
Today Horoscope: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు13-07-2025
Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఫలమిస్తాయి10-07-2025