శ్రావణమాసం మొదటి శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు భారీగా దేవాలయాలకు వెళ్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో ఉజ్జయిని ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కిటకిటలాడుతోంది.

భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.

మరోవైపు కొత్తపేట్ అష్టలక్మి దేవాలయంలోనూ అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు కుంకుమార్చనలు చేశారు.

శ్రావణమాసం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి.

ముఖ్యంగా మొదటి శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

కాగా, శుక్రవారం ఉదయం నుంచీ భక్తులు వివిధ ఆలయాలకు తరలివెళ్లి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.