వినాయక చవితి సందర్భంగా భక్తులు గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు.
పూజా సమయంలో విగ్రహంపై పాలవెల్లి కట్టి..దానికింద వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేస్తారు.
ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే.. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి.
ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాం. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.
గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి , స్థితి , లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి.
గణేశుడి పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు.
ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమ , జీవాన్ని సూచించేందుకు పత్రినీ , ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తారు.
గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవుడు.
ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అని అర్థం.
పాలపుంతని సూచించే పాలవెల్లికి.. నక్షత్రాలకు గుర్తుగా పళ్లు కడతారు. వెలగపండు, మొక్కజొన్నపొత్తులు , జామ, దానిమ్మలాంటి పండ్లు కడతారు.
Related Web Stories
వినాయకుడి విగ్రహాన్ని ఏ సమయంలో ప్రతిష్టించాలి..
Today Horoscope: ఈ రాశి వారికి ప్రయాణాలు చర్చలు అనందం కలిగిస్తాయి17-08-2025
కృష్ణాష్టమి స్పెషల్ స్వామివారు మెచ్చే నైవేద్యం అటుకుల దద్దోజనం
అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు..