హిందువులు అత్యంత సంబురంగా జరుపుకునే పండుగ కృష్ణాష్టమి
ఈ పండుగను శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అనే పేర్లతో పిలుస్తుంటారు.
కృష్ణాష్టమి స్పెషల్ స్వామి వారు మెచ్చే నైవేద్యం
కావాల్సిన పదార్థాలు: నెయ్యి,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర,పచ్చిమిర్చి,ఎండుమిర్చి,అల్లం ముక్క,మిరియాలు,ఇంగువ,కరివేపాకు,అటుకులు,పెరుగు
అటుకులను ఒక గిన్నెలోకి తీసుకుని, రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత నీటిని పూర్తిగా వంపేసి అటుకులను జల్లి గిన్నెలో వేసుకుని ఓ 5 నిమిషాలు పక్కన ఉంచాలి.
ఈ లోపు దద్దోజనానికి కావాల్సిన పచ్చిమిర్చి, అల్లాన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
ముందుగా స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి, అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించాలి.
పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
మిరియాలు వేసి ఓ నిమిషం ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇంగువ, కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈలోపు మిక్సింగ్ బౌల్లోకి కడిగి పక్కన పెట్టి అటుకులను తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి.
ఈ అటుకుల మిశ్రమంలోకి ముందే సిద్ధం చేసుకున్న తాలింపు వేసి కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే అటుకుల దద్దోజనం రెడీ.
Related Web Stories
అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు..
కృష్ణాష్టమి రోజు ఈ పనులు అస్సలు చేయకండి..
కృష్ణాష్టమి రోజు ఇలా చేస్తే...
ఇంట్లో జెర్రిని చూడడం శుభమా.. అశుభమా..!