కృష్ణాష్టమి రోజు ఇలా చేస్తే...
హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలో కృష్ణాష్టమి ఒకటి. స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
గోకులాష్టమి,శ్రీ కృష్ణ జన్మాష్టమి అనే పేర్లతో పిలవబడే ఈ పండుగా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధ లతో జరుపుకుంటారు.
శ్రీకృష్ణాష్టమి పూజను భక్తితో నిర్వహిస్తే శాంతి, సంపద, సుఖం, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయని నమ్ముతారు.
ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి పూజా స్థలాన్ని పవిత్రంగా ఉంచి, పూలతో అలంకరించాలి.
ఈ రోజున మీ ఇంటిని అందంగా సంప్రదాయబద్ధంగా పూలు, అరటి చెట్లు, మామిడి కొమ్మలతో అలంకరిస్తే అదృష్టం లభిస్తుంది.
పూజ కోసం శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం, పుష్పాలు, తులసి ఆకులు గంధం అగరుబత్తి, దీపం, నీరు, నైవేద్యం కోసం వెన్న, పండ్లు అటుకులు సిద్ధం చేయాలి.
శ్రీకృష్ణుని పూజ చేసుకొని, దూపం,దీపం, హారతి ఇవ్వాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా హరే కృష్ణ హరే కృష్ణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
గోవులపై దయతో వ్యవహరించాలి. జంతువులకు ఆహార, పానీయాలు అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుంది.
కృష్ణ జన్మాష్టమి రోజున తులసి ఆకులను తెంపకూడదు. ఎందుకంటే శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్క.
కృష్ణాష్టమి రోజు మాంసం, మద్యం తీసుకోకూడదు. శాఖాహారమే తినాలి.
Related Web Stories
ఇంట్లో జెర్రిని చూడడం శుభమా.. అశుభమా..!
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
Today Horoscope: ఈ రాశి వారు కొత్త పరిచయాల వల్ల ఆర్థికంగా లాభిస్తుంది03-08-2025
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకుంటారు