వినాయకుడి విగ్రహాన్ని  ఏ సమయంలో ప్రతిష్టించాలి..

దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది.

ఆగస్టు 27  బుధవారం ఉదయం వినాయకుడు  తొలి పూజ అందుకోనున్నాడు.

లంబోదరుడిని ఏ సమయంలో ప్రతిష్టించాలి. పూజ సమయంలో చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గణేష్ చతుర్థి రోజున ఉదయం 11 గంటల తర్వాత వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం మంచిది.

దానికంటే ముందే తీసుకురావాలనుకుంటే, ఈ శుభ సమయాల్లో తేవచ్చు.

ఉదయం 7:33 గంటల నుంచి 9:09 వరకు.

ఉదయం 10:46 గంటల నుంచి మధ్యాహ్నం 12:22 వరకు.

మనసు పరిమళంగా ఉంచుకోవాలి. దేవుడిపై ఏకాగ్రత, భక్తి నిలపాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు.