ఈ రోజున శివుడు, విష్ణువులను పూజించడం  శ్రేయస్కరం. .

ఉదయాన్నే స్నానం చేసి, దగ్గరలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం

ఇలా చేయడం వల్ల సకల దరిద్రాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి,

నదిలో లేదా సముద్రంలో స్నానం చేసి, ఆలయంలో కానీ, నదీ తీరంలో కానీ దీపాలు వెలిగించి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది.

ముఖ్యంగా 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం లేదా దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

మీ శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల కూడా అప్పుల సమస్యలు తీరుతాయి.

కార్తీక పౌర్ణమి నాడు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం లేదా వినడం వల్ల  ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

రాత్రి చంద్రోదయ సమయంలో చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదమని నమ్ముతారు.