కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే..!
ఈ పౌర్ణమి శివ మరియు విష్ణువులకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇద్దరినీ పూజించడం ద్వారా విశేషమైన శుభాలు పొందుతారు.
ఈ రోజును దేవతల దీపాల పండుగగా, త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున దేవతలందరూ భూమిపైకి వచ్చి దేవాలయాల్లో దీపాలను వెలిగిస్తారని నమ్ముతారు.
కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం చాలా ముఖ్యం. శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.
ఉసిరికాయలపై దీపాలు వెలిగించడం కూడా ఒక ప్రత్యేకత. ఇది ఉసిరికాయ దానంలో భాగంగా భావిస్తారు.
ఈరోజు సముద్రస్నానం చేయడం ఎంతో పుణ్యమని భావిస్తారు.
శ్రీకృష్ణుడి రాసలీల మహోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు.
స్త్రీలు 720 వత్తుల నెయ్యి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం చేస్తారు.
సత్యనారాయణ వ్రతం వంటి విశిష్ట వ్రతాలు చేయడానికైనా, ఈ పౌర్ణమి రోజునే చేయడం అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి బదిలీలు మార్పులకు అనుకూలం పెద్దలు పై అధికారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది05-11-2025
మీ సొంతింటి కల నిజం కావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
ఏ పనులు చేసే వారు రుద్రాక్ష.. దరిస్తారు
కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..