వాస్తు  జ్యోతిష్యం ప్రకారం మీ సొంతింటి కల నెరవేరడానికి కొన్ని సాధారణ చిట్కాలు

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం ద్వారానే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది.

కాబట్టి, దానిని ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచాలి.

 అశోక లేదా మామిడి ఆకులు, పూలతో అలంకరించడం మంచిది.

ఇంటి ఉత్తర దిక్కున వాస్తు పెయింటింగ్స్ ఉంచడం వల్ల అదృష్టం పెరుగుతుంది. 

ప్రవహించే నీరు ఉన్న పెయింటింగ్స్ ఆర్థిక వృద్ధికి సహాయపడతాయి.

ఇంట్లో సహజ సూర్యకాంతి గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. తగినంత సూర్యకాంతి సానుకూల శక్తిని మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది.

ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి. ఇది సానుకూల శక్తి ప్రవాహానికి సహాయపడుతుంది.

ఆగ్నేయ మూలలో దక్షిణ-తూర్పు దీపం వెలిగించడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుంది.