రాత్రి పడుకునే ముందు కర్పూరం వెలిగించి ఇల్లంతా చూపించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.

రావి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయడం, దీపం వెలిగించడం మేలు చేస్తుంది.

ఇంట్లో వాటర్‌ఫౌంటెన్ లేదా  బుద్ధుడి విగ్రహాన్ని  ఉంచుకోవడం మంచిది.

ఈ విగ్రహాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

తెలుపు, లేత నీలం, లావెండర్ వంటి ప్రశాంతమైన రంగులను వాడటం మంచిది.

కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం వల్ల బంధాలు బలపడతాయి.

ఇంట్లో చెత్త, అనవసరమైన వస్తువులను తీసివేయాలి, ముఖ్యంగా ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచాలి.

కిటికీలో క్రిస్టల్ విండ్‌చైమ్స్ ఏర్పాటు చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

అరోమాథెరపీ, సంగీతం, ఒత్తిడి తగ్గించే అలవాట్లు చేసుకోవాలి.

ఈ చిట్కాలు ఇంట్లో గొడవలను తగ్గించి, శాంతిని నెలకొల్పడంలో సహాయపడతాయి.