క్రిస్మస్ పండుగ సమయంలో చాలా మంది తమ ఇళ్లపై లేదా క్రిస్మస్ ట్రీపై స్టార్ పెట్టడం మనం చూస్తుంటాం..

అయితే, ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, దీని వెనుక ఒక ముఖ్యమైన అర్థం, కథ ఉంది

బైబిల్ ప్రకారం, యేసు క్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది

ఈ నక్షత్రం యేసు జన్మించిన ప్రదేశాన్ని చూపిందని నమ్మకం

ఆ నక్షత్రం మూడు జ్ఞానులకు మార్గదర్శకంగా నిలిచిందని కథనం

వారు ఆ నక్షత్రాన్ని అనుసరించి యేసు జన్మించిన చోటుకు చేరుకున్నారు

అందుకే క్రిస్మస్ సందర్భంగా స్టార్‌ను దారి చూపించే కాంతిగా భావిస్తారు

క్రిస్మస్ సమయంలో స్టార్ పెట్టడం ద్వారా యేసు జన్మను గుర్తు చేసుకుంటారు

ఇంటికి దైవ ఆశీస్సులు రావాలని కోరుకుంటారు

చీకటిలో వెలుగులా ఉండాలనే సందేశం ఇవ్వడం అనే భావనలు వ్యక్తమవుతాయి