విఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే పర్వదినం వినాయక చవితి

ఈరోజు వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకుంది.

చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలందరూ వైభవంగా పండుగను నిర్వహించుకుంటున్నారు.

పుణ్యస్నానాలు ఆచరిస్తూ పూజలు, పునస్కారాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.

చిన్నారులు, యువత వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రోడ్లన్నీ లంబోదరుడి విగ్రహాలతో నిండిపోయాయి.