నేటి రాశి ఫలాలు... 6-09-2026

06-09-2026 ఆదివారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, ఆస్పత్రులు, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ప్రియతముల నుంచి శుభవార్త అందుకుంటారు. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. పొదుపు పథకాలకు సంబంఽధించి చర్చలు ఫలిస్తాయి.

06-09-2026 ఆదివారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

06-09-2026 ఆదివారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) విద్యార్థులకు అడ్మిషన్లకు, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అనుకూలమైన రోజు. శుభవార్త అందుకుంటారు. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. మెయిల్స్‌, వాట్సాప్‌ సందేశాలు సంతోషం కలిగిస్తాయి.

06-09-2026 ఆదివారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. గతంలో చేసిన కృషికి ఫలితం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత చదువులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు.

06-09-2026 ఆదివారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వేడుకులు ఉల్లాసం కలిగిస్తాయి. పది మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. సంకల్పం నెరవేరుతుంది.

06-09-2026 ఆదివారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. లక్ష్య సాధనలో గత అనుభవం ఎంతగానో తోడ్పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

06-09-2026 ఆదివారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. సమావేశాలు, వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

06-09-2026 ఆదివారం

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, పన్నులు, పెట్టుబడుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

06-09-2026 ఆదివారం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) వేడుకలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

06-09-2026 ఆదివారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. వైద్య సేవలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పాతబకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

06-09-2026 ఆదివారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై వడ్డీలు, మంచి లాభాలు అందుకుంటారు. బృందకార్యక్రమాల్లో స్నేహానుబంధాలు బలపడతాయి.