నేటి రాశి ఫలాలు.. 05-09-2026

05-09-2026 శనివారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) చర్చలు, ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. తోబుట్టువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21- మే 20 మధ్య జన్మించిన వారు) ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్య కోసం అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. డిపాజిట్లు, చిట్‌ఫండ్‌ పెట్టుబడులు లాభిస్తాయి. టెలివిజన్‌, సినిమా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

05-09-2026 శనివారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ఇల్లు, స్థల సేకరణకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. మార్పులు, చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. హార్డ్‌వేర్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

05-09-2026 శనివారం

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు) దూరప్రయాణాలకు అనుకూలం. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. సినీ రాజకీయ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

05-09-2026 శనివారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణాలు మంజూరవుతాయి. వేడుకలు, బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

05-09-2026 శనివారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.

05-09-2026 శనివారం

.తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) రక్షణ, బోధన, న్యాయ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. దూర ప్రాంతంలో ఉన్న వారి నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

05-09-2026 శనివారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. రుణాలు మంజూరవుతాయి. సకాలంలో అనుకున్న నిధులు చేతికి అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

05-09-2026 శనివారం

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. కొత్త పరచయాలు లక్ష్య సాధనకు ఉపయోగపడుతాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

05-09-2026 శనివారం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) హోటల్‌, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు

05-09-2026 శనివారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) చిన్నారులు, ప్రియతములకు అవసరమైన నిధులు సకాలంలో సర్దుబాటు అవుతాయి. డిపాజిట్లపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

05-09-2026 శనివారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) భాగస్వామి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఇల్లు, స్థల సేకరణ విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి.