నేటి రాశి ఫలాలు.. 14-09-2026

14-09-2026 సోమవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోతారు. భాగస్వామి ఆరోగ్యం కలవరపెడుతుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల కోసం ఖర్చులు అధికం. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాట పెడతారు. పరమశివుని ఆరాధన శుభప్రదం.

14-09-2026 సోమవారం

మిథునం (మే 21- జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ప్రియతముల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల్లో ఖర్చులు అధికం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

14-09-2026 సోమవారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. టెలివిజన్‌, క్రీడలు, ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రియతముల వైఖరిలో మార్పు గమనిస్తారు. భవానీ శంకరుని ఆరాధించండి.

14-09-2026 సోమవారం

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు సకాలంలో చేరక ఇబ్బంది పడతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శివ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

14-09-2026 సోమవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) ఆర్థికపరమైన చర్చలు ఫలించకపోవచ్చు. నిధుల విషయంలో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రయాణాలు, వాహనాల కోసం ఖర్చులు అధికం. తోబుట్టువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పరమ శివుని ఆరాధన శుభప్రదం.

14-09-2026 సోమవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మంచిది. శ్రీ రుద్ర కవచ పారాయణ మేలు చేస్తుంది.

14-09-2026 సోమవారం

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు) అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో అశాంతికి లోనవుతారు. వైఫల్యాలపై సమీక్షించుకునేందుకు ఇది సరైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల గురించి ఆలోచిస్తారు. పరమేశ్వరుడిని ఆరాధించండి.

14-09-2026 సోమవారం

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. ఊరేగింపులు, ప్రదర్శనల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకంటారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

14-09-2026 సోమవారం

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక వ్యవహారాల్లో పెద్దలు, నిపుణుల సలహా మేరకు నడుచుకోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. బృందకార్యక్రమాల్లో పెద్దలను కలుసుకుంటారు. శివ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

14-09-2026 సోమవారం

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) వృత్తిపరమైన చర్చలు, సమావేశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. వేడుకల్లో మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. శివ పంచాక్షరీ పారాయణ శుభప్రదం.

14-09-2026 సోమవారం

12-12-2024  గురువారం

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రుల ఆరోగ్యం కలవరపెడుతుంది. వేడుకలు, సమావేశాల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. భవానీ శంకరుని ఆరాధించండి.