నేపాల్‌లో దీపావళిని ‘తిహర్’ అంటారు. ఐదు రోజుల పాటు జరుగుతుంది. జంతువుల్ని ప్రత్యేకంగా పూజిస్తారు.

సింగపూర్‌లో దీపావళి పబ్లిక్ హాలిడే. భారతీయులు ఉండే ప్రాంతంలో అద్భుతంగా జరుగుతుంది.

మలేషియాలో హరి దివాళి అని పిలుస్తారు. ఇక్కడ కూడా పబ్లిక్ హాలిడే. కానీ, కొన్ని ఏరియాల్లో బాణసంచా పేల్చటం నిషిద్ధం.

ఫిజిలో కూడా భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీపావళి చాలా బాగా జరుగుతుంది.

మార్షియస్ దేశంలో కూడా దీపావళి పబ్లిక్ హాలిడే. ఇండియాలో జరిగినట్లే ఇక్కడ కూడా సంబరాలు జరుగుతాయి.

అమెరికా, కెనడా దేశాల్లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ ఇండియాలో జరిగినట్లే సంబరాలు జరుగుతాయి.

శ్రీలంకలో సెటిల్ అయిన భారతీయులు దీపావళి పండుగను పెద్ద ఎత్తున జరుపుతారు.

సౌత్ ఆఫ్రికాలోనూ దీపావళి పండుగ సాంప్రదాయ బద్ధంగా జరుగుతుంది.