అమావాస్య రోజు లక్ష్మీదేవిని  ఆరాధించడం చాలా మంచిది.

ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజున లక్ష్మీపూజ చేయడం చాలా ముఖ్యమైన ఆచారం

అశ్వినీ మాసంలో వచ్చే దీపావళి అమావాస్య రాత్రి, లక్ష్మీదేవి క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఆమె ఆశీస్సులు పొందడం ద్వారా ఇంట్లో సిరిసంపదలు నిలిచి ఉంటాయని నమ్ముతారు.

దీపావళి రోజున ప్రదోష కాలం  సూర్యాస్తమయం తర్వాత వచ్చే సమయం లక్ష్మీపూజకు అత్యంత శుభప్రదమైన సమయం.

అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక సుస్థిరత, ఆనందం, విజయం లభిస్తాయని నమ్మకం.

అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు, దానధర్మాలు చేయడం వల్ల వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి. దీనితో లక్ష్మీదేవి కరుణిస్తుందని విశ్వసిస్తారు.

ఒకవేళ శుక్రవారం అమావాస్య కలిసి వస్తే, అది లక్ష్మీపూజకు చాలా అరుదైన  విశేషమైన రోజు.