ప్రతి శుక్రవారం ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించి, 

చక్కెర, కుంకుమ, పసుపు సమర్పించి లక్ష్మీ 108 నామాలు జపించాలి.

శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తరం వంటివి నిత్యం పఠించాలి.

ఇంటిని, పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీ దేవికి అపరిశుభ్రత నచ్చదు.

తామర పువ్వులు, ఎరుపు లేదా పసుపు రంగు పువ్వులను సమర్పించాలి.

పాయసం, పాలు, చక్కెరతో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి.

బయటకు వెళ్లే ముందు నుదుటిపై కుంకుమతో తిలకం పెట్టుకోవాలి.

పేదలకు సహాయం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.