Today Horoscope: ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది గృహరుణాలు మంజూరవుతాయి

10-12-2025 బుధవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) పెట్టుబడులు, పొదుపు పథకాల విషయాలో మీ అంచనాలు ఫలిస్తాయి. క్రీడలు, ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహరుణాలు మంజూరవుతాయి. పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఫర్నీచర్‌, గృహనిర్మాణ సామగ్రి, రిటైల్‌ రంగాల వ్యాపారులకు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

10-12-2025 బుధవారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్‌ రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వేడుకలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.

10-12-2025 బుధవారం

కర్కాటకం (జూన్‌ 22 0 జూలై 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు అందుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. వేడుకలకు సంబఽంధించిన చర్చలు ఫలిస్తాయి.

10-12-2025 బుధవారం

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) సృజన్మాత్మకంగా ఆలోచించి, మీ ఆలోచనలను విజయవంతంగా అమలు చేస్తారు. ప్రేమానుబంధాలు బలడపతాయి. విద్య, చిట్‌ఫండ్‌, విద్యాసంస్థలు, టెలివిజన్‌, ఆడిటింగ్‌ రంగాల వారు కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు.

10-12-2025 బుధవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) అలజడి తగ్గి మానసిక శాంతి లభిస్తుంది. ఇంటి నిర్మాణం, స్థలసేకరణ, అద్దె విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ వ్యవహారాలపై కీలక నిర్ణయం తీసుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు.

10-12-2025 బుధవారం

తుల (సెప్టెంబరు 24-అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా రంగాలకు చెందిన వారితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.

10-12-2025 బుధవారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అదుకుంటారు. పైఅధికారుల సహకారంతో ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

10-12-2025 బుధవారం

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణాలు, చర్చలు సత్ఫలితాలనిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

10-12-2025 బుధవారం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. హార్డ్‌వేర్‌, ఫైనాన్స్‌, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి.

10-12-2025 బుధవారం

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం శుభప్రదం.

10-12-2025 బుధవారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యం, హోటల్‌, ఆహార ఉత్పత్తుల వ్యాపారులు పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేయడంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.