మన ఇంట్లో పెద్దలు చిన్న పిల్లలకు పాదాలకు నల్లదారం కట్టడం చూస్తూ ఉంటాం. కానీ చాలా మందికి ఎందుకు కడతారో అసలు తెలియదు.
నలుపు రంగు శని, రాహు గ్రహాలతో ముడిపడి ఉంటుంది. ఈ దారం కట్టడం వల్ల ఈ గ్రహాల చెడు ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని, ప్రతికూల శక్తిని నియంత్రణలో ఉంచుతుందని నమ్మకం.
మన పెద్దలు పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం ఎక్కువగా కాలికి నల్ల దారం కట్టేవాళ్ళు.
కాలికి నల్ల దారం కట్టుకుంటే సంతోషం, శ్రేయస్సును ఇస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు.
కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతాయని జ్యోతిష్యులు అంటున్నారు.
జ్యోతిష్యం ప్రకారం స్త్రీలు ఎప్పుడు ఎడమ కాలికి నల్ల దారాన్ని ధరించాలి. పురుషులు వారి కుడి కాలుకు నల్ల దారాన్ని కట్టుకోవాలి.
నలుపు రంగు దారం కాళ్లకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా జీవితంలో పాజిటివ్ వైబ్స్ ను తెస్తుంది. అంతేకాకుండా అదృష్టం తోపాటు సంపదను కూడా ఆకర్షిస్తుందని శాస్త్రం చెబుతుంది.
కొందరికి పాదాలకు నల్ల దారం ధరించడం అశుభకరం, చెడుగా పరిగణించబడుతుంది.
పైన ఇచ్చిన సమాచారం మనిషి నమ్మకాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం