మీ ప్రియమైన వారికి దీపావళి రోజున  వీటిని బహుమతిగా ఇవ్వండి..

దీపావళి నాడు ప్రజలంతా ఎంతో సంతోషంగా దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తుంటారు.

దీని వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా భవిష్యత్తు తరాలకూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా దీపావళిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

గాలిని శుద్ధి చేసే మొక్కలు వంటివి ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం పర్యావరణానికి మేలు చేస్తుంది.

గాలిని శుద్ధి చేసే మొక్కలు వంటివి ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం పర్యావరణానికి మేలు చేస్తుంది.

అలాగే సహజమైన రంగుల అద్దకంతో కూడిన చీరలు లేదా కుర్తాలు వంటివి ఇవ్వొచ్చు.

ఆకులు, పువ్వులు లేదా విత్తనాల వంటి సహజ పదార్థాలతో చేసిన గ్రీటింగ్ కార్డులు బహుమతిగా ఇవ్వొచ్చు.

రుచికరమైన స్వీట్ బాక్స్, దీపాలు లేదా క్రాఫ్ట్‌లు వంటి వాటిని బహుమతిగా ఇవ్వడం ఉత్తమం.

పర్యావరణానికి హాని కలగని ఇలాంటి దీపావళి పండగ ఆరోగ్యంతోపాటు భవిష్యత్తు తరాలకు మంచిది.