గుంటూరు జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది

స్టాక్‌పాయింట్ల వద్ద  లారీలో ఇసుక లోడింగ్‌కు  మెట్రిక్‌ టన్నుకు రూ.250 ధర చెల్లిస్తే సరిపోతుంది.

లారీ, ట్రాక్టర్‌, ఎద్దులబండికి సంబంధించిన రవాణా  ఛార్జీలు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.

అవినీతి, అక్రమాలు నివారించేందుకు స్టాక్‌పాయింట్ల వద్ద యూపీఐ చెల్లింపు విధానం అమలు చేయనున్నారు.

కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెం స్టాక్ యార్డుల వద్ద ఇసుక అందుబాటులో ఉంటుంది. 

కొల్లిపరలో 33,388.50, మున్నంగిలో 1,81,303.50, గుండిమెడలో 20,958మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి.

తాళ్లాయపాలెంలో 3,91,242.399, లింగాయపాలెంలో 2,98,480.05మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది.

జిల్లాలో మొత్తం 9,23,372.45మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉండగా అది రెండు నెలలకుపైగా అవసరాలకు సరిపోతుంది. 

స్టాక్‌యార్డుల వద్దకు వినియోగదారులు ఎవరు ముందు వెళ్తే వారికే ముందుగా ఇసుక సరఫరా చేస్తారు.

వినియోగదారులు తమ  ఆధార్‌ కార్డు చూపించి రోజుకు 20మెట్రిక్‌ టన్నుల వరకు ఇసుక తీసుకెళ్లొచ్చు.

స్టాక్‌యార్డుల వద్ద సమస్యలకు 0863 2234301, DICMC2024@gmail.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

లారీ, ట్రాక్టర్‌ యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఉప రవాణా శాఖ కార్యాలయం చర్యలు చేపడుతుంది.