పసుపుమయం..  ఎన్టీఆర్ భవన్ మార్గం

సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. 

జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి ఎన్టీఆర్ భవన్‌కి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. 

బాబు మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన టీడీపీ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. గొడవలు లేకుండా ఇరు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. 

పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటే అభివృద్ధికి విఘాతం కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు.

ప్రసంగం ముగిసిన అనంతరం తన కోసం తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో బాబు సెల్ఫీలు, ఫొటోలు దిగారు.