భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటించారు.

పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన స్వాగతం పలికారు.

ప్రోటోకాల్ పక్కనపెట్టి పుతిన్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.

నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వచ్చారు.

పాలం ఎయిర్‌పోర్టు నుంచి ఒకే కారులో మోదీ, పుతిన్‌ వెళ్లారు.

అనంతరం ప్రధాని మోదీతో పుతిన్‌ డిన్నర్‌ మీట్‌‌లో పాల్గొన్నారు.

ఈ మీట్‌లో ఇరుదేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీ, పుతిన్‌ చర్చించారు.

 శుక్రవారం జరిగే భారత్‌-రష్యా 23వ వార్షిక సదస్సులో పుతిన్‌ పాల్గొననున్నారు. 

ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు పుతిన్‌.

భారత్‌ - రష్యా మధ్య అణు విద్యుత్‌ సహా కీలక రంగాల్లో ఒప్పందాలు జరగనున్నాయి.

ఇరుదేశాల వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌ - రష్యా మధ్య 25కు పైగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు సమాచారం. 

భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు పుతిన్‌.

ఈ ఏడాది మోదీ - పుతిన్‌ రెండోసారి సమావేశం అయ్యారు.