పార్లమెంటు ఆవరణకు కుక్కను తీసుకుని రావడంపై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

మూగజీవాలను తాను ప్రేమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

పార్లమెంటు ఆవరణలోకి కుక్కలు రాకూడదనే నిషేధం ఏదీ లేదని పేర్కొన్నారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఒకసారి ఎద్దులబండిపై పార్లమెంట్‌కు వచ్చారని గుర్తుచేశారు

కుక్కలు ఎంతో విధేయతతో ఉంటాయని చెప్పుకొచ్చారు.

కుక్కల విధేయత గురించి ఈ వ్యక్తులకేం తెలుసునని ప్రశ్నించారు.

 ఇప్పుడు కిరణ్ రిజిజు తమకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తారా..? అని ప్రశ్నించారు రేణుకా చౌదరి.

ముందు కిరణ్ రిజిజు వారి పార్టీ విషయం చూసుకోవాలని హితవు పలికారు.

మీ మంత్రులు రైతులపై కార్లు ఎక్కించి చంపారని ధ్వజమెత్తారు.

తమకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు కిరణ్ రిజిజు వారి పార్టీ వైపు  ఓసారి చూసుకోవాలని సూచించారు.

తనపై ఎవరు హక్కుల తీర్మానం పెడతారో తనకెలా తెలుస్తోందని ప్రశ్నించారు.