ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటనపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రధాని మోదీ.

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో కుట్ర కోణంపై ఏజెన్సీల దర్యాప్తు మొదలైందని హెచ్చరించారు.

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీ పేలుళ్ల భయానక ఘటన ప్రతి ఒక్కరి మనసును కలిచివేసిందని తెలిపారు.

ఈ ఘటనలో బాధిత కుటుంబాల వేదన తనకు అర్థమవుతోందని అన్నారు.

ఈ రోజు దేశం మొత్తం బాధితుల పక్కనే నిలబడి ఉందని ఉద్ఘాటించారు.

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై  కేంద్ర ఇంటెలిజన్స్ సమగ్ర దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై కేంద్ర భద్రత బలగాలతో చర్చిస్తున్నానని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

ఈ ఘటన కుట్ర వెనుక ఉన్న ప్రతి అంశాన్ని తాము వెలికితీస్తామని హెచ్చరించారు.