ప్రజల ముందుకు ఖమేనీ..
ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి!
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు.
టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమంలో ఖమేనీ పాల్గొన్నారు.
ఖమేనీ రాగానే కార్యక్రమంలో ఉన్న వారంతా పిడికిలి బిగించి, నినాదాలు చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడుల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఖమేనీ.
రహస్య బంకర్‌లో ఆశ్రయం పొందారు ఖమేనీ. ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ను నిలిపివేశారు అధికారులు.
జూన్ 11న సైనిక కమాండర్ల సమావేశంలో కనిపించిన ఇరాన్ సుప్రీం లీడర్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.
ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మధ్యలో ఓ వీడియో రిలీజ్ చేసినా ఆయన ఎక్కడ ఉన్నారనే జాడ మాత్రం బయటపడలేదు.
మతపర కార్యక్రమంలో ఖమేనీ పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Related Web Stories
KTR: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అప్పటివరకు బతుకుతా.. దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు!
కోడి ఈ దేశానికి జాతీయ పక్షి అని మీకు తెలుసా?
పట్టువిడవని పుతిన్.. ట్రంప్‌తో ఆటాడుకుంటున్నారు!