అప్పటివరకు బతుకుతా..  దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంకో 30 నుంచి 40 ఏళ్లు జీవించాలని ఉందని టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా అన్నారు.

జీవించినన్ని రోజులు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు.

బుద్ధుని బోధనల వ్యాప్తి కోసం కృషి చేస్తానని దలైలామా పేర్కొన్నారు.

ఇప్పుడు తనకు 90 ఏళ్లు నిండాయని.. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ జరుగుతోందన్నారు.

గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే తన వారసుడ్ని ఎంపిక చేసే అధికారం ఉందని తేల్చిచెప్పారు.

తాను 110 ఏళ్లు జీవిస్తానని ఓ కల వచ్చినట్లు గతంలో ఒకసారి దలైలామా పేర్కొన్నారు.

జులై 6న 90వ పడిలోకి అడుగు పెడుతున్నారు దలైలామా. ఈ నేపథ్యంలో ఆయన దీర్ఘాయుష్షు కోసం అనుచరులు ప్రార్థనలు చేశారు.