అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

34వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుంది.

సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుంది.

7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతాయి.

ఏపీ ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు.