ఏపీ మారిటైం పాలసీ-2024పై సచివాలయంలో ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్షించారు

నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్లు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి అని

పోర్టులతో రోడ్డు, రైలు కారిడార్లను అనుసంధానం చెయ్యాలి

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగునకు పీ4 విధానాన్ని అనుసరించాలి అన్నారు

అంతర్జాతీయ షిప్‌ బిల్డింగ్‌ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి

వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం.. మౌలిక వసతుల కల్పన..

సమర్థమైన విధానం ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి అన్నదే విజన్‌ అని చంద్రబాబు పేర్కొన్నారు

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైం హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని 

సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో

దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు